హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన మేఘాలు.. ఏ క్షణమైన వర్షం పడే అవకాశం

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అల్పపీడన ప్రభావంతో ఆకాశం మేఘావృతమైంది, సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన మేఘాలు.. ఏ క్షణమైన వర్షం పడే అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో వాతావరణం (the weather) ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ఉదయం నుంచి ఎండ దంచి కొట్టింది. కానీ మధ్యాహ్నం సమయానికి ఆకాశం పూర్తిగా మేఘావృతమై, వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నగర ప్రజలు, వాహన దారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటో మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసి.. నగరానికి 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది.

ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రత 29°C గా నమోదైంది. సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉన్నందున, వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తత వహించాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆకస్మికంగా కురిసే వర్షాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Next Story