- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీవీకే విజయ్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై క్లారిటీ..!
2026 ఎన్నికల్లో పెరంబూర్ లేదా కొలత్తూరు నుండి విజయ్ పోటీ చేసే అవకాశం! ఉత్తర చెన్నైపై టీవీకే ఫోకస్. కార్యకర్తల సమావేశంలో కీలక తీర్మానం.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే జిల్లాల పర్యటన చేస్తూ.. పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పోటీ చేయబోయే స్థానంపై సోషల్ మీడియాతో పాటు తమిళనాడు ఓటర్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ అనేక సమీకరణాల తర్వాత ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే దానిపై ఉన్న సస్పెన్స్‌కు కొంత క్లారిటీ వచ్చింది.
ఈ రోజు చెన్నైలో జరిగిన టీవీకే కార్యకర్తల సమావేశంలో, పార్టీ అధ్యక్షుడు విజయ్‌ను పెరంబూర్ (Perambur) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ ఆధవ్ అర్జున ఈ ప్రతిపాదనను తీసుకురాగా, క్యాడర్ అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కాగా ఉత్తర చెన్నైలో పేదరికం, ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడి నుంచే మార్పు మొదలవ్వాలని విజయ్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే, కేవలం పెరంబూర్ మాత్రమే కాకుండా కొలత్తూరు (Kolathur), ఆర్.కె నగర్ (RK Nagar) స్థానాలను కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం కొలత్తూరు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. ఒకవేళ విజయ్ అక్కడ పోటీ చేస్తే, అది స్టాలిన్ వర్సెస్ విజయ్ మధ్య భారీ పోరుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీ ఆనంద్ మాట్లాడుతూ.. కార్యకర్తల అభీష్టాన్ని విజయ్‌కు వివరిస్తామని, తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని స్పష్టం చేశారు.






