- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్, నాగశౌర్య బంధువులా? ఫుల్ క్లారిటీ ఇదే..
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ అందుకున్నాడు. తన నటన, డైలాగ్స్, డ్యాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్‌టీఆర్ క్వాలిటీస్ అన్నీఇన్నీ కాదు. అయితే గతకొన్నాళ్లుగా టాలీవుడ్ హీరోస్ ఎన్‌టీఆర్, యంగ్ హీరో నాగశౌర్య చుట్టాలంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. పదకొండేళ్ల క్రితం టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పటివరకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో నందమూరి కుటుంబాన్ని తెగ పొగిడేస్తూ కనిపించాడు.
దీంతో నాగశౌర్యకు నందమూరి ఫ్యామిలీకి చుట్టరికం ఉందంటూ వార్తలే తప్ప దానిపై ఇప్పటివరకు క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజాగా నాగశౌర్య తల్లి ఉష ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నాగశౌర్య, ఎన్‌టీఆర్‌లకు ఎటువంటి బంధుత్వం లేదని, నాగశౌర్యకు నందమూరి కుటుంబం అంటే అభిమానం అని చెప్పుకొచ్చింది. దీంతో గత కొన్నాళ్లుగా అందరినీ పట్టిపీడిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది.
- Tags
- NTR
- naga shourya






