ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పెషల్ థ్యాంక్స్: సీజేఐ ఎన్వీ రమణ

by Disha Web Desk 2 |
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పెషల్ థ్యాంక్స్: సీజేఐ ఎన్వీ రమణ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఐఏఎమ్‌సీ భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కొనసాగుతోందని అన్నారు. ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మధ్య వర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరుప్రఖ్యాతలు వస్తాయని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని ఆకాంక్షించారు. ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ భవన నిర్మాణానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సి ఉంది కానీ, స్వల్ప అనారోగ్యం కారణంగా రాలేకపోయారని, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నానని నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జీలు హిమా కోహ్లీ, నాగేశ్వరరావు, తెలంగాణ మంత్రులు మహబూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్‌లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed