BRAIN FOODS: చాక్లెట్స్-చీజ్-మందు.. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయా?

by Kodari Anjali |

చీజ్ అనేది పాలు ప్రోటీన్ కేసైన్. గడ్డకట్టడం ద్వారా లభించే పాల ఉత్పత్తి.

BRAIN FOODS: చాక్లెట్స్-చీజ్-మందు.. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయా?
X

దిశ, వెబ్‌డెస్క్: చీజ్ అనేది పాలు ప్రోటీన్ కేసైన్. గడ్డకట్టడం ద్వారా లభించే పాల ఉత్పత్తి. సాధారణంగా గేదె, ఆవులు, మేకలు లేదా గొర్రెల పాల నుంచి చీజ్ ఉత్పత్తి చేయబడుతుంది. ఇంకా చీజ్ తో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చీజ్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయని నిపుణులు చెబుతున్నాయి. అంతేకాకుండా చీజ్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

ఇది తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణ సమస్యలు తగ్గించడంలో మేలు చేస్తుంది. వీటితో పాటు చీజ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

అయితే చీజ్ అండ్ వైన్ గురించి తాజాగా నిపుణులు ఓ విషయాన్ని పంచుకున్నారు. చీజ్ అండ్ వైన్ ఆయుష్షును పెంచుతుందని అంటున్నారు నిపుణులు. అల్జీమర్స్ వ్యాధిపై పరిశోధన చేయగా.. చాక్లెట్స్ అండ్ చీజ్, వైన్ ఆయుష్షును పెంచుతుందని వెల్లడైంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణలు చెబుతున్నారు. కాగా రెడ్ వైన్, చాక్లెట్స్, చీజ్ ను హెల్తీ ఫుడ్ జాబితాలో యాడ్ చేశారు.

అమెరికన్ నేషనల్ కాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండేళ్ల కిందట నిర్వహించిన పరిశోధనలో.. ప్రతిరోజూ 12 గ్రాముల డార్క్ చాక్లెట్లు తిన్న వారిలో హార్ట్ ఎటాక్ అలాగే గుండె సంబంధిత వ్యాధులు.. మరణాల ప్రమాదాన్ని కూడా 12 శాతం తగ్గిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.. ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ ఉండే డార్క్ చాక్లెట్స్ తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. రెడ్ వైన్ తాగితే..రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు.. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో మేలు చేస్తుంది. అలాగే శరీరంలోని ఇన్ఫెక్షన్‌ తగ్గిస్తుంది.

చీజ్ తింటే ఎముకలను హెల్తీగా ఉంచుతాయి. మెమోరీ పవర్ ను కూడా పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చీజ్ లో ఫాస్పరస్, ప్రోటీన్,కాల్షియం, బి 12 కె 2 వంటి పోషకాలు దట్టంగా ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే లినోలిక్ ఆమ్లం హెల్తీగా ఉంచేందుకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story