బర్త్‌డే వేళ రాంచరణ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరు..

by Disha Web Desk 19 |
బర్త్‌డే వేళ రాంచరణ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరు..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్.. తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. రోజురోజుకు నటనలో పరిపూర్ణత సాధిస్తోన్న చెర్రీ.. సినిమాలో పాత్రదైనా సరే పరకాయ ప్రవేశం చేస్తు్న్నాడు. అద్భుత నటన, డ్యాన్స్, ప్రవర్తనతో అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన రాంచరణ్ పుట్టిన రోజు నేడు. దీనితో సోషల్ మీడియా వేదికగా చెర్రీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిలో భాగంగా చిరు.. కొడుకు బర్త్‌డే సందర్భంగా ఓ రేర్ ఫొటోను ట్వీటర్‌లో షేర్ చేసి అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. చెర్రీ చిన్ననాటి ఫొటో షేర్ చేయగా.. ఇందులో రాంచరణ్‌ను చిన్నతనంలో తన ఒళ్లో కూర్చొబెట్టుకోని ఉండగా.. మరోవైపు ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో చెర్రీకి చిరు మేకప్ సరిచేస్తున్న ఫొటో పెట్టాడు. ఈ ఫొటోపై అభిమానుల రకరకాల కామెంట్లు చేస్తు్న్నారు. అలాగే రాంచరణ్‌కు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ చెప్పటం వింతగా అనిపిస్తుందని రాసుకొచ్చారు. కొడుకుగా చరణ్ తనను గర్వపడేలా చేశాడని ఈ సందర్భం అన్నారు.




Next Story

Most Viewed