Acharya: రామ్ చరణ్‌కు చిరంజీవి వార్నింగ్.. వీడియో వైరల్

by GSrikanth |   ( Updated:2023-10-10 11:15:28.0  )
Acharya: రామ్ చరణ్‌కు చిరంజీవి వార్నింగ్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కీలక పాత్ర చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇటీవల విడుదలైన ఆచార్య ట్రైలర్‌లో చిరంజీవిని చూస్తుంటే వింటేజ్ మెగాస్టార్ గుర్తుకొస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. ఆచార్య సినిమా నుంచి భలే భలే బంజారా అనే పాటను విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్, చిరంజీవి సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. డామినేట్ చేద్దామని అనుకుంటున్నావా? తగ్గురా? అంటూ చరణ్‌కు చిరంజీవి వార్నింగ్ ఇస్తాడు. డామినేట్ చేయను గానీ, తగ్గను అని రామ్ చరణ్ కౌంటర్ వేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో భారీ ఎత్తున చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలకు రెడీ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed