- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG హైకోర్టును ఆశ్రయించిన చిరంజీవి, ప్రభాస్ నిర్మాతలు
మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రం, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మనశంకర వరప్రసాద్ గారు చిత్రం, రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రాజాసాబ్ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల నిర్మాతలు మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మన శంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్ చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా, అందుకు కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేయనున్నది. చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న, ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.






