- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు.. కాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలతో విభేదించిన చిన్మయి
టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తన సినిమా సూపర్ హిట్ ఫంక్షన్ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో 'కాస్టింగ్ కౌచ్' లేదని ఆయన చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన సినిమా సూపర్ హిట్ ఫంక్షన్ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ (Casting Couch) పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో 'కాస్టింగ్ కౌచ్' లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా చిరంజీవి వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద (Singer Chinmayi Sripada) ఘాటుగా స్పందించారు. చిరంజీవి వ్యాఖ్యలను విభేదిస్తూ, పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది నియంత్రణలో లేని ఒక తీవ్రమైన సమస్య అని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి కాలంలో మహిళా కళాకారులకు గౌరవం ఉండవచ్చు కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చిన్మయి అభిప్రాయపడ్డారు. పరిశ్రమ ఒక అద్దం లాంటిదని చిరంజీవి అనడాన్ని తప్పుబడుతూ, అది అద్దం లాంటిది కాదని, ఇక్కడ అవకాశాల కోసం లైంగిక వేధింపులు ఒక చేదు నిజమని ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
పరిశ్రమలో 'కమిట్‌మెంట్' (లైంగిక కోరికలు తీర్చడం)కు అంగీకరించకపోతే అవకాశాలు రాకుండా చేస్తున్నారని చిన్మయి ఆరోపించారు. ఇక్కడ ప్రతిభకు బదులుగా సెక్స్ కోరుకునే సంస్కృతి ఉందని, దీనిపై నోరు విప్పితే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావిస్తూ, గతంలో లిరిక్ రైటర్ వైరముత్తు తనను వేధించిన విషయాన్ని ఆమె మరోసారి గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని లేవని అనడం బాధితులను మరింత కుంగదీస్తుందని, ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ చిన్మయి స్పష్టం చేశారు.






