- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నం.. చైనా మహిళ అరెస్ట్
ఇండో-నేపాల్ (Indo-Nepal) సరిహద్దు సమీపంలో వీసా, పాస్‌పోర్టు పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా మహిళ (Chine Women)ను సహస్త్ర సీమా బల్ సిబ్బంది అరెస్టు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇండో-నేపాల్ (Indo-Nepal) సరిహద్దు సమీపంలో వీసా, పాస్‌పోర్టు పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా మహిళ (Chine Women)ను సహస్త్ర సీమా బల్ సిబ్బంది అరెస్టు చేశారు. నౌతన్వా ప్రాంతంలోని బైరియా బజార్‌లోని ఫుట్‌పాత్‌పై చైనా మహిళ భారత్‌లోకి ప్రవేశిస్తుండగా సాధారణ తనిఖీల్లో భాగంగా సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. దేశంలోకి వచ్చేందుకు ఆమె వద్ద ఎలాంటి పత్రాలు లేవని తేలడంతో ఆమెను అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ సందర్భంగా నౌతన్వా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పురుషోత్తమ రావు మాట్లాడుతూ.. ఆమె వద్ద దొరికిన ఒక స్లిప్ ఆధారంగా ఆమె పేరు హువాజియా జీ (Huajia Jie) అని, చైనా పౌరురాలిగా గుర్తించామని అన్నారు. మహిళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. భారత్‌కు రావడం వెనుక ఉద్దేశంపై విచారిస్తున్నామని స్పష్టం చేశారు. భాషా కారణంగా ఆమె నుంచి సరైన సమాచారం తెలుసుకోవడానికి సమయం పడుతోందని ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
Read More..






