- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా అణు రహస్యాలు లీక్!
చైనా అణు రహస్యాలు లీక్ అయ్యాయని జరుగుతున్న అంతర్జాతీయ చర్చలు సంచలనం రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : చైనా అణు రహస్యాలు లీక్ అయ్యాయని జరుగుతున్న అంతర్జాతీయ చర్చలు సంచలనం రేపుతున్నాయి. చైనా ప్రభుత్వం తన అత్యున్నత సైనిక అధికారి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన జనరల్ జాంగ్ యూషియా చైనా అణు ఆయుధాల ప్రోగ్రాంకు సంబంధించిన కీలక సాంకేతిక సమాచారాన్ని అమెరికాకు లీక్ చేశారని ఆరోపిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన జాంగ్ యూషియాపై, పదవీ ప్రమోషన్ల కోసం భారీ లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం చైనా సైన్యంలో జరుగుతున్న మిలిటరీ పర్జ్ లో భాగంగా ఆయనపై అంతర్గత దర్యాప్తు కొనసాగుతోందని, క్రమశిక్షణలను తీవ్రంగా ఉల్లంఘించారనే ఆరోపణల కింద కేసు నడుస్తోందని సమాచారం. జిన్‌పింగ్ చేపడుతున్న సైనిక ప్రక్షాళన మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవహారంతో చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై చైనా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.






