- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దావోస్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సు-2026 లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ చేరుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సు-2026 లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ చేరుకుంది. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఉండగా, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Duddilla Sridhar Babu) ఇప్పటికే దావోస్ చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తెలంగాణ బృందం అత్యంత కీలకంగా వ్యవహరించనుంది. ఈ పర్యటనలో ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్ (‘Telangana Rising 2047’ roadmap)ను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పరిచయం చేయనున్నారు. గత డిసెంబర్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా, రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
తొలిరోజు నుంచి ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక విధానాలు, భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలను ఆయన వివరించనున్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న ఈ పర్యటనపై రాష్ట్రవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.






