- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అశ్లీల డీప్‌ఫేక్‌లకు చెక్.. గ్రోక్ ఏఐపై 'ఎక్స్' కఠిన ఆంక్షలు
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్', తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'గ్రోక్' ద్వారా అసభ్యకరమైన ఏఐ చిత్రాల సృష్టిని అడ్డుకోవడానికి సాంకేతిక చర్యలు చేపట్టింది.

దిశ, వెబ్ డెస్క్: కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఎక్స్(twitter)లో గ్రోక్ ఏఐ సాయంతో అశ్లీల కంటెంట్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో ఎక్స్ వేదికగా ప్రముఖుల ఫొటోలను అశ్లీలంగా మార్చి పోస్టులు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, ప్రసార మంత్రిత్వ శాఖ తీవ్ర స్థాయిలో స్పందించి ఎక్స్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్', తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'గ్రోక్' ద్వారా అసభ్యకరమైన ఏఐ చిత్రాల సృష్టిని అడ్డుకోవడానికి సాంకేతిక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా నిజమైన వ్యక్తులను తక్కువ దుస్తుల్లో చూపేలా రూపొందించే డీప్‌ఫేక్ చిత్రాల వల్ల ఎదురైన తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
అశ్లీల చిత్రాల సృష్టి చట్టవిరుద్ధమైన దేశాల్లో, ప్రాంతాల్లో, వ్యక్తులను బికినీలు, లోదుస్తులతో ఉన్నట్లుగా ఏఐ చిత్రాలను తయారు చేసే సదుపాయాన్ని 'జియోబ్లాక్' (Geoblock) చేస్తున్నట్లు ఎక్స్ ప్రకటించింది. ఈ ఆంక్షలు పెయిడ్ సబ్‌స్క్రైబర్లతో సహా వినియోగదారులందరికీ వర్తిస్తాయని సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా, గ్రోక్ ద్వారా చిత్రాలను సృష్టించడం, వాటిని ఎడిట్ చేసే సదుపాయాన్ని ఇకపై కేవలం పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది. ప్లాట్‌ఫామ్ నిబంధనలను ఉల్లంఘించే వారు, చట్టవిరుద్ధమైన పనులకు ఏఐని వాడుకునే వారిని గుర్తించి, బాధ్యులను చేసేందుకు ఈ నిబంధన అదనపు రక్షణ కవచంగా పనిచేస్తుందని ఎక్స్ తన 'సేఫ్టీ' హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించే చర్యలపై ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.






