‘8 వసంతాలు’నుంచి క్యారెక్టర్ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన మ్యాడ్ బ్యూటీ

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-28 18:10:58  IST  )

MAD ఫేమ్ అనంతిక సునీల్‌కుమార్(Anantika Sunilkumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. అయితే ఈ చిత్రాన్ని ఫణీంద్ర దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు.

‘8 వసంతాలు’నుంచి క్యారెక్టర్ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన మ్యాడ్ బ్యూటీ
X

దిశ, సినిమా: MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్(Anantika Sanilkumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. అయితే ఈ చిత్రాన్ని ఫణీంద్ర (Phanindra)దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు. దీనిని మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్(Mythry Movie Makers) రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్, శశాంక్ మాలి ఎడిటర్, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాలోని హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ మేకర్స్ విడుదల చేసి క్యూరియాసిటీని పెంచారు.

శుద్ధి అయోధ్య (Shuddhi Ayodhya)క్యారెక్టర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఏముందంటే.. ట్రైనింగ్ సెంటర్‌లో ఒక అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌ని సవాలు చేయడంతో టీజర్ ప్రారంభమైంది. ఆమె శుద్ధి అయోధ్య మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాల గురించి కాన్ఫిడెంట్ గా చెబుతుంది. అతనికి ధైర్యం ఉంటే తనతో ఫైట్ చేయమని ఛాలెంజ్ చేస్తుంది. శుద్ధి అయోధ్య ఒక మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలుగా పరిచయం అయ్యింది. సంతోషాలు, కన్నీళ్లు, విలువైన పాఠాలతో నిండిన మహిళ ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనంతిక సనీల్‌కుమార్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటోంది.

Click For Video..

Next Story