- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచిత బిర్యానీ ప్యాకెట్ల పంపిణీలో గందరగోళం
హనుమకొండ కేయూ క్రాస్‌రోడ్డు వద్ద నూతనంగా ప్రారంభమైన సురభి ఫుడ్ కోర్టు నిర్వహించిన ఉచిత బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : హనుమకొండ కేయూ క్రాస్‌రోడ్డు వద్ద నూతనంగా ప్రారంభమైన సురభి ఫుడ్ కోర్టు నిర్వహించిన ఉచిత బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉచితంగా 300 బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని ముందస్తుగా ప్రచారం చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయితే, జనసమ్మర్దానికి తగిన ఏర్పాట్లు చేయకుండా చిన్న సందులోనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేయడంతో ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట చోటుచేసుకోగా పలువురు మహిళలు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ప్రజల భద్రత, క్యూలైన్ నిర్వహణ, బారికేడ్లు, పోలీసు బందోబస్తు వంటి కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై నిర్వాహకులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎలాంటి భారీ ప్రమాదం జరగకపోవడం అదృష్టమని, ఒకవేళ తొక్కిసలాట వంటి ఘటన జరిగి ఉంటే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఉచిత పంపిణీ కార్యక్రమాలకు సంబంధిత అధికారులు తగిన భద్రతా చర్యలు, నియంత్రణ ఏర్పాట్లు ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.






