- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వంలో మార్పు మీ నుండే మొదలవ్వాలి.. ఉద్యోగులకు ప్రధాని మోడీ కీలక పిలుపు
ప్రభుత్వంలో మార్పు కొత్త ఉద్యోగుల నుంచి మొదలవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వంలో మార్పు కొత్త ఉద్యోగుల నుంచి మొదలవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు అండగా నిలిచే లక్ష్యంతో నిర్వహిస్తున్న 'రోజ్ గార్ మేళా'లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలకు ఎంపికైన 61,000 మంది యువతకు ఆయన వర్చువల్ విధానంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ, అమృత కాలంలో దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, నూతన ఉద్యోగులు దేశ సేవలో అంకితభావంతో పని చేయాలని కోరారు.
అలాగే ప్రభుత్వ పాలనలో సంస్కరణలు, పారదర్శకతపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. గత 5-7 ఏళ్లలో సామాన్య పౌరులుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అప్పట్లో మీరు ఎదుర్కొన్న అడ్డంకులు, గమనించిన లోపాలు ప్రస్తుతం మీ పాలనలో ప్రజలకు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత కొత్త ఉద్యోగులపైనే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో భాగమైన ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో చిన్నపాటి సంస్కరణలు (Small Reforms) తీసుకురావాలని ఆయన కోరారు.
గతంలో మీరు అనుభవించిన ఇబ్బందులు మీ హయాంలో మరెవరికీ కలగకుండా చూడటమే మీ అసలైన విజయం" అని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్యుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా ప్రజలకు చేరవేసేందుకు ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.






