బ్యాట్‌తో అదరగొట్టే షాట్స్ ఆడిన ఎమ్మెల్యే వీడియో వైరల్..

by Disha Web Desk 13 |
బ్యాట్‌తో అదరగొట్టే షాట్స్ ఆడిన ఎమ్మెల్యే వీడియో వైరల్..
X

దిశ, చార్మినార్: ఇప్పటివరకు తన స్పీచ్‌లతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకునే చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ.. షేర్వానీ ధరించి క్రీడా మైదానంలో ఒక్కసారిగా సందడి చేశాడు. క్రికెట్​బ్యాట్​చేతపట్టిన అక్బరుద్దీన్ ఓవైసీ గ్రౌండ్‌లో దుమ్ము లేపాడు. క్రికెట్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్​ ఏదైనా ఆడగలనని ఆడిమరీ నిరూపించాడు. రంజాన్​ సందర్భంగా ఉదయం నుంచి ఉపవాస దీక్షలో నిమగ్నమై ఉండే అక్బరుద్దీన్ ఓవైసీ.. సాయంత్రం ఇఫ్తార్, ప్రత్యేక ప్రార్థనల అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. పాతబస్తీ ఘాజీమిల్లత్​ కాలనీలో గ్రౌండ్‌లో తన కుమారుడు డాక్టర్​నూరుద్దీన్‌తో కలిసి అక్బరుద్దీన్ ఓవైసీ క్రికెట్​ఆడారు. తన కుమారుడు నూరుద్దీన్​బౌలింగ్​చేయగా క్రికెట్​నెట్స్‌లో అక్బరుద్దీన్​ఓవైసీ బ్యాట్ చేత పట్టి అదరగొట్టే షాట్స్ ఆడారు. అనంతరం బాస్కెట్​బాల్​గ్రౌండ్‌లో బాస్కెట్​బాల్ సైతం ఆడారు. కాసేపటి తర్వాత బ్యాడ్మింటన్​ కూడా ఆడారు. దీంతో రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోను తనకు మంచి పట్టుందని చెప్పకనే చెప్పారు అక్బరుద్దీన్​ఓవైసీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతుంది.




Next Story

Most Viewed