- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ నేత అలా చేయడం వల్లే మహిళా వీఏవో ఆత్మహత్య చేసుకుంది : చంద్రబాబు
దిశ, ఏపీ బ్యూరో : కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో వీవోఏల సంఘం నాయకురాలు నాగలక్ష్మిది..latest telugu news

దిశ, ఏపీ బ్యూరో : కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో వీవోఏల సంఘం నాయకురాలు నాగలక్ష్మిది ఆత్మహత్య కాదని వైసీపీ నేత హత్యేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేత దుర్భాషలు, వెకిలి చేష్టల వల్ల ఆత్మహత్య చేసుకుందని విమర్శించారు. ఈ మేరకు ఓ వార్తను ట్విటర్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు.
'రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదని మచిలీపట్నంలో నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైంది. మచిలీపట్నంలో వీవోఏగా పనిచేస్తున్న నాగలక్ష్మి తనను అధికార పార్టీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణం. ఒక మహిళ స్వయంగా స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్యలు తీసుకోని ఈ వ్యవస్థను ఏమనాలి? ప్రజల ప్రాణాల కంటే, బాధితుల వేదనల కంటే రాజకీయ ప్రయోజనాలే పోలీసులకు ప్రాధాన్య అంశంగా మారిపోయాయి. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలి' అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.






