NTR-Prasanth Neel మూవీలో చాన్స్.. క్లారిటీ ఇచ్చిన కన్నడ బ్యూటీ

by Mallepaka Hamsa |   (  Updated:2024-10-26 14:28:41  IST  )

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasant) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

NTR-Prasanth Neel మూవీలో చాన్స్.. క్లారిటీ ఇచ్చిన కన్నడ బ్యూటీ
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘సప్త సాగరాలు దాటి’(Sapta Sagaralu Dhaati ) సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ యంగ్ బ్యూటీ శివకార్తికేయన్‌(Sivakarthikeyan)తో రొమాన్స్ చేయబోతుంది. ఏఆర్ మురుగదాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. అలాగే తెలుగులో నిఖిల్(Nikhil Siddharth) ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక కన్నడలో స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar) నటిస్తున్న ‘భారతి రంగల్’ (Bharati Rangal) సినిమాలో నటించనుంది.

‘సప్త సాగరాలు దాటి’చిత్రంతో ఫుల్ ఫేమస్ అయిన ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. రుక్మిణి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్(NTR-Prasanth Neel) కాంబోలో రాబోతున్న మూవీలో చాన్స్ అందుకున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి(Rukmini Vasanth) దీనిపై క్లారిటీ ఇచ్చింది.. ‘‘ఆ సినిమా కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నాకు ఎన్టీఆర్‌తో నటించే చాన్స్ వచ్చిందని కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. అదొక అందమైన రూమర్. అయితే ఒకవేళ నాకు ఆ మూవీలో నటించే చాన్స్ వస్తే మాత్రం వెంటనే సైన్ చేసేస్తాను’’ అని చెప్పుకొచ్చింది.

Next Story