నీట్ పేపర్ లీక్ పై జ్యూడిషరీ ఎంక్వైరీ చేపట్టాలి : చాడ వెంకటరెడ్డి

by Muthe.Rajitha |

నీట్ పేపర్ లీక్ తో మోడీ ప్రభుత్వం తలదించుకోవాలని సీపీఐ సీనియర్ నాయకులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.

నీట్ పేపర్ లీక్ పై జ్యూడిషరీ ఎంక్వైరీ చేపట్టాలి : చాడ వెంకటరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : నీట్ పేపర్ లీక్ తో మోడీ ప్రభుత్వం తలదించుకోవాలని సీపీఐ సీనియర్ నాయకులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. నీట్ పేపర్ లీక్ తో వేలాది మంది విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయని తెలిపారు. దీనిపై జుడిషరీ ఎంక్వైరీ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ బాగుందని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం ఈ పేపర్ లీకేజీ తో అభాసపాలైందని విమర్శించారు. రాజస్థాన్ తదితర ప్రాంతాలలో పేపర్ లీకేజీ చేసి వందల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నారని, దీని వెనుక ఉన్న వారిని గుర్తించి శిక్షించాలన్నారు.

బండి భగీరథ్ ను అరెస్టు చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పై ఫోక్సో కేసును నీరు కార్చకుండా విచారణ వేగవంతంతోపాటు అరెస్టు చేయాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే సిట్ విచారణ జరిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భగీరథను పట్టుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతుందని ప్రశ్నించారు.

Next Story