2022-23 అర్ధభాగంలో మెరుగ్గా ఉద్యోగాల కల్పన!

by Disha Web Desk 17 |
2022-23 అర్ధభాగంలో మెరుగ్గా ఉద్యోగాల కల్పన!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి మొదటి ఆరు నెలల కాలంలో ఉపాధి కల్పన అవకాశాలు మెరుపడతాయని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఇటీవల నిర్వహించే సర్వేలో దేశీయ కంపెనీల సీఈఓలు అంచనా వేశారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల సెంట్రల్ బ్యాంక్ పాలసీ విధానాలను కఠినతరం చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని పరిశ్రమల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ కౌన్సిల్ సమావేశంలో దేశవ్యాప్తంగా 136 మంది సీఈఓల నుంచి సీఐఐ వివరాలను రూపొందించింది. సీఈఓల ప్రకారం, గతేడాదితో పోలిస్తే ఈసారి గ్రామీణ డిమాండ్ సానుకూలంగా ఉందని సర్వేలో పాల్గొన్న 49 శాతం మంది సీఈఓలు చెప్పారు.

అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 2022-23 మొదటి అర్ధభాగంలో కంపెనీల ఆదాయ వృద్ధి 10 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటుందని 44 శాతం మంది అన్నారు. అలాగే, 32 శాతం మంది 20 శాతం కంటే ఎక్కువ ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. అధిక ద్రవ్యోల్బణ సవాళ్లతో పాటు ఇన్‌పుట్ ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రతికూలత ఉన్నప్పటికీ దేశీయ సరఫరా, ఎగుమతుల విషయంలో వ్యాపారాల పనితీరు సానుకూలంగా ఉండటంతో పరిశ్రమలో ఉపాధి, ఆదాయాలపై వృద్ధి ఉంటుందని సీఈఓలు భావిస్తున్నారని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల వల్ల కంపెనీల ఆదాయం దాదాపు 5-10 శాతం మధ్య ప్రభావితమవుతుందని, 28 శాతం మంది 10-20 శాతం మధ్య లాభాలపై ప్రభావితమవుతాయని పేర్కొన్నారు.



Next Story