లోక్ సభలో బిగ్ ట్విస్ట్.. రాహుల్ గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత

by Malleboina Mahesh |

భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

లోక్ సభలో బిగ్ ట్విస్ట్.. రాహుల్ గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత
X

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బడ్జెట్ 2026-27 పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. సభలో సంచలన వ్యాఖ్యలతో పాటు ఆరోపణలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం 'సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం' (Privilege Motion) తెస్తుందని అంతా భావించారు. కానీ కేంద్రం రాహుల్ పై హక్కుల తీర్మానానికి విముఖత చూపింది. అలాగే ప్రతిపక్ష నేత ప్రసంగం నుండి కొన్ని వ్యాఖ్యలు తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై లోక్ సభలో మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి రాహుల్ గాంధీ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ గాంధీ స్పందన

తాజా పరిణామాలపై రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. బీజేపీ నేతలకు మీడియా ద్వారా కొన్ని "కీవర్డ్స్" అందుతున్నాయని, వాటినే వారు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ రాహుల్‌కు మద్దతుగా నిలుస్తోంది. దేశ ప్రయోజనాల గురించి మాట్లాడటం తప్పా? అని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం లోక్‌సభలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. నిషికాంత్ దుబే ఇచ్చిన నోటీసులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story