ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. క్వింటాల్‌పై 13% ధర పెంపు

by Malleboina Mahesh |   (  Updated:2026-07-04 09:05:17  IST  )

ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. కొనుగోలు ధర క్వింటాల్‌కు 13% పెంపు.. రూ.1,875 నుండి రూ.2,125కు మద్దతు ధరను పెంచింది.

ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. క్వింటాల్‌పై 13% ధర పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: ధర తక్కువగా ఉండటంతో కష్టాల్లో ఉన్న దేశవ్యాప్త ఉన్న ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) శుభవార్తను అందించింది. మార్కెట్‌లో ఉల్లి ధరల స్థిరీకరణ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా, కేంద్ర బఫర్ స్టాక్ (Buffer Stock) సేకరణ కోసం ఉల్లి కొనుగోలు ధరను ఏకంగా 13 శాతం పెంచుతూ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా సవరణతో ఉల్లి కనీస కొనుగోలు ధర ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 2,125 కు చేరింది.

ఈ సీజన్‌లో ఇది ఐదో సారి పెంపు..

గతంలో కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ ఉల్లికి రూ. 1,875 మద్దతు ధరగా చెల్లించేది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, రైతుల పెట్టుబడి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ధరకు అదనంగా రూ. 250 పెంచారు. ఈ ప్రస్తుత మార్కెటింగ్ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం ఉల్లి కొనుగోలు ధరలను పెంచడం ఇది ఐదో సారి కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్ (NAFED), ఎన్‌సీసీఎఫ్ (NCCF) ద్వారా రైతుల నుంచి నేరుగా ఈ పెంచిన ధరలకే బఫర్ స్టాక్ సేకరించనున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బహిరంగ మార్కెట్‌లో మధ్యవర్తుల దోపిడీ తగ్గి, ఉల్లి రైతులకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

గ్యాస్ సిలిండర్ ధర రూ. 2 వేలు దాటాల్సి ఉండే కానీ.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Next Story