మేడారం జాతరకు కేంద్రం సాయం

by Gantepaka Srikanth |

మేడారం మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

మేడారం జాతరకు కేంద్రం సాయం
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం మహా జాతర(Medaram Jathara)కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.3.70 కోట్ల నిధులు కేటాయిస్తూ శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఈ నిధులను కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా మంజూరు చేశాయి. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మేడారం జాతరకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలివస్తుండటంతో.. భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సమ్మక్క - సారలమ్మల జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి జాతరతో భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా సహకారం అందించడం గిరిజన సంస్కృతి పరిరక్షణకు తోడ్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story