పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి

by Malleboina Mahesh |

రేపటి (జనవరి 28) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: రేపటి (జనవరి 28) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget sessions of Parliament) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని (All-party meeting) నిర్వహించింది. ఈ భేటీలో రాజ్యసభా పక్ష నేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో జరిగే మొదటి పార్లమెంట్ సమావేశాలు కావడంతో, సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ పార్టీల నేతలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం నోట్ చేసుకుందని, నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

సమావేశాల షెడ్యూల్ ప్రకారం.. రేపు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. అనంతరం జనవరి 29న ఆర్థిక సర్వేను (Economic Survey) సభ ముందు ఉంచుతారు. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుందని, ఆ తర్వాత బడ్జెట్‌పై ఉభయ సభల్లో సమగ్ర చర్చ చేపడతామని రిజిజు వివరించారు. ఈ కీలక సమావేశాల్లో ప్రజా సమస్యలను సమర్థవంతంగా చర్చించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం ఈ సందర్భంగా అన్ని పార్టీలను కోరింది.

Next Story