- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో నేటి నుంచి జనగణన ప్రారంభం.. యాప్ ద్వారా 'సెల్ఫ్ ఎమ్యూనరేషన్'
ఏపీలో నేటి నుండి 16వ జనగణన ప్రారంభం! ప్రత్యేక యాప్ ద్వారా సెల్ఫ్ ఎమ్యూనరేషన్ సౌకర్యం. కేంద్ర, రాష్ట్ర పథకాలకు ఈ గణాంకాలే కీలకం.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకమైన 16వ జాతీయ జనగణన (Census) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత జరుగుతున్న 8వ జనగణన ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో రూపొందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలకు ఈ గణాంకాలే ప్రామాణికం కానున్నాయి. ఈసారి జనగణనలో సాంకేతికతకు పెద్దపీట వేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎమ్యూనరేషన్' సౌకర్యాన్ని కల్పించారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, డేటా సేకరణలో ఖచ్చితత్వం పెరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా నియమించబడిన సిబ్బంది ఇంటింటికి తిరిగి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రజలందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములై, సరైన వివరాలు అందించి దేశాభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.






