ఈ వారం చెత్త దుస్తుల జాబితాలో ఉన్న సెలబ్రిటీస్

by Disha Web Desk 16 |
ఈ వారం చెత్త దుస్తుల జాబితాలో ఉన్న సెలబ్రిటీస్
X

దిశ, సినిమా : సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వచ్చారంటే.. కచ్చితంగా ఏదో ఒక్క కొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే వారు కారు దిగుతుండగానే క్లిక్‌ అనిపించేందుకు కెమెరాలు రెడీగా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా వరకు సెలబ్రిటీలు సాదా సీదాగానే బయటకొచ్చేస్తున్నారు. ఈ మేరకు చెత్త డ్రెస్సింగ్‌ ఫోటో క్లిక్‌లో ఈ వారం అనన్యా పాండే, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, అలియా భట్ ట్రెండింగ్‌లో నిలిచారు. దీంతో వీరికి అసలు డ్రెస్సింగ్ సెన్స్ ఉందా? అని నెటిజన్లు ట్రోల్ చేస్తు్న్నారు. ఇటీవల అనన్యా పాండే రెండ్ అండ్ వైట్ చెక్ అవుట్‌ఫిట్స్‌లో కనిపించగా.. ఈ ఫ్యాషన్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక హుమా ఖురేషి పుట్టినరోజున విద్యా బాలన్ చీర కట్టులో హాజరవగా.. అది కూడా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా టాప్ టు బాటమ్ డెనిమ్ వేర్‌లో ఎయిర్‌పోర్ట్‌లో చాలా సాధారణంగా కనిపించింది సోనాక్షి సిన్హా.



Next Story

Most Viewed