- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్నపత్రం QR కోడ్ స్కాన్ చేస్తే యూట్యూబ్ సాంగ్.. క్షమాపణ కోరిన CBSE
ప్రతిష్టాత్మక CBSE పరీక్షా పత్రంపై గల QR కోడ్ స్కాన్ చేస్తే యూట్యూబ్ సాంగ్ ప్లే కావడం సంచలనం సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో సీరియస్‌గా రాసే సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు పరీక్షల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మార్చి 9న జరిగిన క్లాస్ 12 మ్యాథమెటిక్స్(Mathematics) పరీక్షా పత్రంలో జరిగిన ఈ వింత సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ప్రశ్నాపత్రం సెట్ వెరిఫికేషన్, డిజిటల్ భద్రత కోసం ముద్రించే క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేస్తే బోర్డు అధికారిక వెబ్‌సైట్ కాకుండా, యూట్యూబ్ వీడియో సాంగ్ ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. మ్యాథ్స్ పరీక్ష అనంతరం విద్యార్థులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా, వారికి 1987 నాటి రిక్ ఆస్ట్లీ హిట్ సాంగ్ "Never Gonna Give You Up" ప్లే అవ్వడంతో అవాక్కయ్యారు.
మీమ్స్ మోత
కాగా ఈ వింత ఘటనపై సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురిసింది. "CBSE రిక్‌రోల్డ్ అస్" అంటూ విద్యార్థులు తమ ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని జోడించి పోస్ట్‌లు చేయడంతో ఈ అంశం ఎక్స్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. కొందరు నెటిజన్లు "మ్యాథ్స్ పేపర్ కష్టంగా ఉందని ఏడుస్తున్న మాకు, సీబీఎస్‌ఈ ఇలాంటి కామెడీ రిలీఫ్ ఇస్తుందని ఊహించలేదు" అని కామెంట్ చేయగా, మరికొందరు విద్యావేత్తలు బోర్డు నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రింటింగ్ ప్రక్రియలో గాని క్యూఆర్ కోడ్ జనరేట్ చేసే సమయంలో గాని జరిగిన సాంకేతిక లోపం వల్ల ఒక ప్రైవేట్ యూట్యూబ్ లింక్ అధికారిక కోడ్‌లోకి చేరినట్లు తెలుస్తోంది. ఇది కేవలం కొన్ని సెట్ల ప్రశ్నాపత్రాల్లో మాత్రమే జరగడం వల్ల, బోర్డు యొక్క క్వాలిటీ చెకింగ్ విభాగంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సీరియస్ ఎగ్జామ్ పేపర్‌పై ఇలాంటి 'ప్రాంక్' వీడియో లింక్ రావడం అనేది భారత విద్యా వ్యవస్థలో ఒక అరుదైన 'డిజిటల్ మిస్టేక్'గా మిగిలిపోయింది.
బోర్డు క్షమాపణలు
ఈ వివాదంపై సీబీఎస్‌ఈ అధికారులు తక్షణమే స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు కోరారు. ఇది కేవలం ప్రింటింగ్ ఎర్రర్ (Printing Error) మాత్రమేనని, ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ తప్పు వల్ల ప్రశ్నాపత్రం లీకేజీ జరిగినట్టు కాదని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు భరోసా ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రశ్నాపత్రాల తయారీ, ప్రింటింగ్ లో మరింత కఠినమైన నిబంధనలను అమలు చేస్తామని, క్వాలిటీ చెక్ పర్యవేక్షణను పెంచుతామని హామీ ఇచ్చింది.






