- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాలి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలోనూ, బొగ్గు ఉత్పత్తిలోనూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలోనూ, బొగ్గు ఉత్పత్తిలోనూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కొనియాడారు. ఇవాళ ఢిల్లీ (Delhi)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికుల పోరాటం చిరస్మరణీయమని గుర్తుచేశారు. ‘సకల జనుల సమ్మె’ నుంచి ప్రతి చిన్న ఆందోళన వరకు సింగరేణి భాగస్వామ్యం రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో బలాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తం మీద అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసే ప్రధాన సంస్థలలో ఒకటిగా సింగరేణి వెలుగొందుతోందని ఆయన ప్రశంసించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆరంభంలో అద్భుతమైన లాభాలతో సాగిన సింగరేణి, ప్రస్తుతం అనేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్థ నిర్వహణలో వస్తున్న మార్పులు, కొన్ని నిర్ణయాల కారణంగా సంస్థ పరిస్థితి దిగజారుతోందని ఆయన విమర్శించారు. ఒకప్పుడు లాభాల బాటలో ఉన్న సంస్థ, ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
టెండర్ల రద్దు సింగరేణికి అన్యాయం చేయడమే..
ప్రస్తుతం నైనీ కోల్ బ్లాక్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ (Telangana)కు గుండెలాంటిది సింగరేణి అని అన్నారు. కానీ, సింగరేణిని బంగారు బాతులా కాంగ్రెస్ వాడుకుంటున్నారని కామెంట్ చేశారు. అవినీతి, అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారిందన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలని కేంద్రం నైనీ కోల్ బ్లాక్-2 (Naini Coal Block-2)ను తెలంగాణకు కేటాయించిందని అన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌ను సింగరేణిని వాడుకుంటున్నాయని తెలిపారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేంద్రం సహకారం అందిస్తోందని, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించానన్నారు. నైనీ బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక టెండర్లు పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నాన్చుతోందని అన్నారు. టెండర్లను రద్దు చేయడం సింగరేణికి ప్రత్యక్షంగా అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. సైట్ విజిట్‌కు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వాలనే నిబంధన పెట్టారని గుర్తుచేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది సెల్ఫ్ సర్టిఫికేషన్ నిబంధన మాత్రమేనని అన్నారు. కానీ, సింగరేణి ఇవ్వాలనే నిబంధన పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీని అర్థం.. వారికి నచ్చిన వారికి నైనీ బ్లాక్ ఇవ్వాలని చూస్తున్నారని కామెంట్ చేశారు.
మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే..
గతంలో సింగరేణి మైనింగ్ చేస్తామని ముందుకొస్తే బీఆర్ఎస్ (BRS) బెదిరించి ప్రైవేటు సంస్థలకు బ్లాక్‌లు వెళ్లేలా వ్యవహరించిందని, ఇప్పుడు కాంగ్రెస్ (Congress) కూడా అదే పంథాను కొనసాగిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. తాడిచర్ల (Thadicharla) కోల్ బ్లాక్‌ను కేంద్రం జెన్‌కోకు కేటాయించిందని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.47 వేల కోట్ల బకాయి ఉందని, గ్రేడ్-11 కోల్‌ను టన్నుకు రూ.4,800కి అమ్ముతోందని అన్నారు. కోల్ ఇండియా గ్రేడ్-11 కోల్‌ను రూ.1,605కి అమ్ముతోందని తెలిపారు. సింగరేణి బొగ్గు క్వాలిటీ కూడా తగ్గుతోందని, ఏపీ సహా పలు రాష్ట్రాలు కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నాయని అన్నారు. ఏది ఏమైనా సింగరేణి అక్రమాలపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందని, సింగరేణిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే సింగరేణి అంశం వెలుగులోకి వచ్చిందని, నైనీ బ్లాకే కాదు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్ర తీసుకుంటుందని.. విచారణపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని కిషన్ రెడ్డి అన్నారు.
వాటాల వివరాలపై స్పష్టత..
సింగరేణి సంస్థపై పూర్తి హక్కులు కేంద్రానివే అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా సంస్థలోని వాటాల వివరాలను ఆయన స్పష్టం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా ఉండగా, కేంద్రానిది 49 శాతం వాటా ఉందన్నారు. మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నందున, సంస్థను కాపాడుకోవడంలో రాష్ట్రం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.






