- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కాం.. ట్రయల్ కోర్టు క్లీన్ చీట్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో సీబీఐ పిటిషన్
కేజ్రీవాల్‌కు ఊరట లభించిన వేళ బిగ్ ట్విస్ట్: ట్రయల్ కోర్టు ఇచ్చిన 'క్లీన్ చీట్'ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సిబిఐ. ముగియని మద్యం పాలసీ కేసు న్యాయపోరాటం.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 23 మందికి ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే కీలక మలుపు తిరిగింది. ట్రయల్ కోర్టు నిర్ణయం పై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 23 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు నిర్దోషులుగా తేల్చడాన్ని సవాల్ చేస్తూ.. సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో న్యాయ పోరాటం మళ్లి ప్రారంభం అయింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన 'క్లీన్ చీట్' ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ అప్పీల్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తులో లభించిన కీలక సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, నిందితులను విడిచిపెట్టడం వల్ల దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది.
ఈ పరిణామం ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. ఉదయం కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో, సీబీఐ హైకోర్టుకు వెళ్లడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. ఈ అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చే తీర్పు కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, స్టే విధిస్తే కేజ్రీవాల్ సహా ఇతర నేతలకు వచ్చిన ఉపశమనం తాత్కాలికమే అవుతుంది. ఈ పరిణామంతో ఈ కేసుపై న్యాయ పోరాటం మళ్ళీ మొదటికి చేరినట్లయింది.






