మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురిపై కేసు

by Ratna Kumari |

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు వ్యక్తులపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురిపై కేసు
X

దిశ, ఘట్‌కేసర్ : మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు వ్యక్తులపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు మూడు రోజుల పాటు **స్వచ్ఛ భారత్** కార్యక్రమంలో భాగంగా సామాజిక సేవ చేయాలని ఎల్‌బీ నగర్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మహిళలను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎల్‌బీ నగర్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

విచారణ అనంతరం కోర్టు వారికి జరిమానా విధించడంతో పాటు మూడు రోజుల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సామాజిక సేవ నిర్వహించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ పోలీసులు మాట్లాడుతూ.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Next Story