- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ఫీ క్రైమ్.. విరాట్ కోసం మైదానంలోకి.. నలుగురిపై కేసు నమోదు
by Harish |
బెంగళూరు : శ్రీలంకతో జరిగిన చివరి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో క్రికెట్ ..telugu latest news

X
బెంగళూరు : శ్రీలంకతో జరిగిన చివరి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో క్రికెట్ అభిమానులు చేసిన పనికి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. మ్యాచ్ విరామం సమయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు నలుగురు యువకులు సెక్యూరిటీని బ్రేక్ చేసి మరీ మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా విరాట్ కలుగజేసుకుని ఫోటోలు దిగాక వారిని అక్కడి నుంచి పంపించివేశారు. అయితే, అనుమతి లేకుండా క్రికెటర్ల భద్రత కోసం ఏర్పాటు చేసిన బయోబబుల్‌ను బ్రేక్ చేసినందుకు ఆ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇందులో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Next Story






