- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Jana Sena Party MLA Arava Sridhar)పై కేసు నమోదైంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్(NHRC) ఆదేశాలతో కడప జిల్లా ఎస్పీ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. BNS 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు ఇవాళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అరవ శ్రీధర్ మీద ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అరవ శ్రీధర్‌ను జనసేన అధిష్టానం ఆదేశించింది. వారం రోజులు గడువు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన విచారణ కమిటీ ముందు నేడు హాజరయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన్ను విచారణ కమిటీ ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం బయట మీడియాతో మాట్లాడారు. తన వివరణ మొత్తం అధిష్టానానికి చెప్పినట్లు అరవ శ్రీధర్ తెలిపారు. అన్ని వివరాలు సమర్పించానని.. పార్టీ నిర్ణయం తీసుకుంటుందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.






