- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, మహబూబాబాద్ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పోరిక బలరాం నాయక్‌పై మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లలో గురువారం కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ సతీష్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంపై ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోరిక బలరాం నాయక్‌తో పాటు మరి కొంతమందిపై టౌన్ ఎస్సై మునీరుల్లా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రోడ్డు అబ్జెక్షన్, అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Next Story






