- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. అలా చేయడంతో తప్పిన ముప్పు..
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ఓ కారు (నెంబర్ ఏపీ09బీడబ్ల్యూ6219) బీభత్సం- latest Telugu news

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ఓ కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దూసుకువచ్చింది. ప్రమాద సమయంలో కారు ముందు సీట్లో కూర్చున్న యువకుడు, డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో బెలూన్లు ఓపెన్ అయి.. వారు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఫుట్ పాత్ పైకి కారు దూసుకువెళ్లడంతో ఇంజిన్ సీజ్ అయ్యింది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రమాదానికి గురైన కారును అక్కడి నుండి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






