వ్యవసాయ బావిలో కి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి గల్లంతు

by Muthe.Rajitha |

జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి - తాటిపెల్లి బైపాస్ రోడ్డు శివారులో కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడిపోవడంతో జగిత్యాల పట్టణానికి చెందిన ఒక యువకుడు గల్లంతయ్యాడు

వ్యవసాయ బావిలో కి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి గల్లంతు
X

దిశ జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి - తాటిపెల్లి బైపాస్ రోడ్డు శివారులోని వ్యవసాయ బావిలోకి అదుపుతప్పి దూసుకెళ్లిన కారు, బావిలో పడిపోవడంతో జగిత్యాల పట్టణానికి చెందిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం జగిత్యాల పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు కారులో మోరపల్లి నుండి తాటిపెల్లి బైపాస్ లో ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో కారులో ముగ్గురు ఉండగా ఇద్దరు యువకులు ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడగలిగారు. అయితే,అదే కారులో ఉన్న దాసరి అరుణ్ అనే యువకుడు బావిలో నీటిలో మునిగి గల్లంతయ్యాడు.సమాచారం అందుకున్న వెంటనే రూరల్ పోలీసులు ,అగ్నిమపాక సిబ్బంది సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం గల్లంతైన అరుణ్ కోసం బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నీటిలో మునిగిపోయిన కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story