- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోజికోడ్‌లో విషాదం: లారీని ఢీకొన్న కారు.. నలుగురు స్నేహితుల మృతి!
కోజికోడ్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ఆనందంగా కారులో వెళ్తున్న నలుగురు స్నేహితులను ఘోర ప్రమాదం (Fatal accident) మృత్యు ఒడిలోకి నెట్టింది. వేగంగా వెళ్తున్న వారి కారు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీ కొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కోజికోడ్‌లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతులను రామనాట్టుకరకు చెందిన ధినిల్, ఫెరోక్‌కు చెందిన అజీష్, విమల్ శ్యామ్‌లాల్‌లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.
కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి, పంతీరంకావుకు చెందిన ధిజిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారు అధిక వేగంతో ఉండటమే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.






