SUNSCREEN FOR INFANTS: శిశువులకు సన్‌స్క్రీన్ లోషన్ రాయొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు?

by Kodari Anjali |

సన్‌స్క్రీన్ లోషన్ వల్ల ప్రయోజనాలు బోలెడు.

SUNSCREEN FOR INFANTS: శిశువులకు సన్‌స్క్రీన్ లోషన్ రాయొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు?
X

దిశ, వెబ్‌డెస్క్: సన్‌స్క్రీన్ లోషన్ వల్ల ప్రయోజనాలు బోలెడు. సన్‌స్క్రీన్ లోషన్‌ సూర్యరశ్మి నుంచి స్కిన్‌ను కాపాడటానికి ఉపయోగిస్తారు. ఇది చర్మం యొక్క ఆరోగ్యాన్ని, రూపాన్ని కాపాడడంలో మేలు చేస్తుంది. సన్‌స్క్రీన్ లోషన్‌ను క్రమం తప్పకుండా వాడటం వల్ల వడదెబ్బ, స్కిన్ క్యాన్సర్, అకాల వృద్ధాప్యం వంటివి రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతారు. సన్‌స్క్రీన్ లోషన్‌ను ముఖం, శరీరంపై సున్నితంగా అప్లై చేయాలి. సన్‌స్క్రీన్ లోషన్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల స్కిన్‌కు మేలు జరుగుతుంది.

సన్‌స్క్రిన్‌ లోషన్‌ను ఫేస్‌కు అప్లై చేశాక.. మళ్లీ రెండు గంటల తర్వాత తిరిగి మళ్లీ అప్లై చేయాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా ఈ లోషన్ రాయాలని నిపుణులు సూచిస్తుంటారు.చర్మం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా.. స్కిన్ పొడి బారకుండా, తేమను కోల్పోకుండా ఉంటుంది. సన్‌స్క్రీన్ లోషన్‌ను రెగ్యులర్‌ స్కిన్ కేర్ రోటీన్లో చేర్చుకోవడం వల్ల పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ కూడా తొలగిపోతుంది.

మరీ చిన్న పిల్లలకు సన్‌స్క్రీన్ లోషన్ రాయొచ్చా? అని తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. శిశువుల స్కిన్ చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా చిన్న పిల్లలకు సన్‌స్క్రీన్ లోషన్ రాయొచ్చా? లేదా అని చాలా మంది తల్లుల్లో ఈ ప్రశ్న తలెత్తే ఉంటుంది. అయితే పిల్లలకు సన్‌స్క్రిన్ లోషన్ రాయకూడదని తాజాగా నిపుణులు వెల్లడించారు. ఎందుకంటే రసాయనాలు దెబ్బతీసే చాన్సులు ఉంటాయని నిపుణులు చెప్పారు.

సన్‌స్క్రిన్ లోషన్‌కు బదులుగా సహజ ప్రత్యమ్నాయాల్ని అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమ్మర్‌లో వదులుగా ఉండే డ్రెస్సెస్ వేయాలి. స్నానానికి ముందు పిల్లల బాడీకి ఆయిల్ రాసి మర్దన చేయాలి. అలాగే 6 నెలల పిల్లల్ని బయటికి తీసుకెళ్లకూడదు. అలాగే ఆరు నెలల కంటే ఎక్కువ ఏజ్ పిల్లలకు సన్‌స్క్రీన్ లోషన్ రాయవచ్చని నిపుణులు క్లారిటీ ఇచ్చారు. కానీ నేరుగా ఎండలోకి వెళ్లినప్పుడు మాత్రమే అప్లై చేయాలని సూచించారు. అలాగే 2 నుంచి 4 గంటల మధ్య బయటకెళ్తే.. తప్పకుండా సన్‌స్క్రీన్ తప్పకుండా రాయాలని నిపుణులు వెల్లడించారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story