ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇక స్థానిక సంస్థల ఉప ఎన్నికల పోరు

by Disha Web Desk 12 |
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇక స్థానిక సంస్థల ఉప ఎన్నికల పోరు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : స్థానిక సంస్థల ఉప పోరుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా, వరుస ఎన్నికలు తదితర కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు సరి అయిన సమయం గా గుర్తించి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 43 ఎంపీటీసీ, 24 సర్పంచ్, 877 వార్డు స్థానాలను అధికారులు గుర్తించారు. త్వరలోనే ఈ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 21 వరకు ఓటరు జాబితా ప్రకటించి. వాటిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించి 23వ తేదీలోపు తుది జాబితా ప్రకటించే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖాళీల వివరాలు

మహబూబ్ నగర్: బాదే పల్లి మున్సిపాలిటీలో జడ్చర్ల గ్రామ పంచాయతీ విలీనం కావడం, జడ్చర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బండమీదిపల్లి, శంకరపల్లి నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడడం తదితర కారణాల వల్ల మండల పరిషత్ ఎన్నికలు, మిగతా మండల పరిషత్ ఎన్నికలతో పాటు జరగలేదు. ఎప్పటికప్పుడు పలు కారణాలతో వాయిదా పడుతూ.. వస్తున్న మండల పరిషత్ ఎన్నికలు స్థానిక సంస్థల ఉప ఎన్నికలతో పాటు జరగనున్నాయి. దీంతో జడ్చర్ల మండల పరిషత్ పరిధిలో ఉన్న 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల అనంతరం జడ్చర్ల మండల పరిషత్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తారు. వీటితో పాటు కొత్తగా ఏర్పడిన బండమీదిపల్లి, శంకరాయ పల్లి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

పలువురు సర్పంచులు తమ పదవులకు రాజీనామాలు చేయడం, అనారోగ్యం, ప్రమాదాల కారణంగా మరణించగా ఖాళీగా ఉన్న బాలానగర్ మండలంలోని హేమాజీపూర్, జడ్చర్ల మండలంలోని బూరుగుపల్లి, గోప్లాపూర్, నసురుల్లాబాదు తాండ, మిడ్జిల్ మండలం లోని ఎద్దుల బై తండా, కోయిలకొండ మండలం లోని సోమ్లా నాయక్ తండా గ్రామ పంచాయతీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా మొత్తం 343 వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాలమూరు జిల్లాలో ఒక మండల ప్రజా పరిషత్ స్థానం తో పాటు, ఖాళీగా ఉన్న ఎనిమిది గ్రామ పంచాయతీలలో ఏడు స్థానాలు, జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోనివి కావడంతో అందరు ఆ నియోజకవర్గం వైపు దృష్టి సాధించవలసిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లాలో మూడు సర్పంచ్, 45 వార్డులు, రెండు ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దామరగిద్ద మండలం లోని లింగారెడ్డిపల్లి, మాగనూరు మండలంలోని కర్ని, తంగిడి గ్రామాల సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగవలసి ఉంది. మరికల్ మండలంలోని పూసలపాడు, మాగనూరు మండలంలోని మండి పల్లి ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వనపర్తి జిల్లా : పెద్దమందడి మండలం బుగ్గ పల్లి తండా, మద్దిగట్ల, ఆత్మకూరు మండలం కాటేపల్లి, పంగల్ మండలం వెంకటయ్య పల్లి, రేవల్లి మండలం బండ రాయిపాకుల సర్పంచ్ స్థానాలు, మీద గ్రామ పంచాయతీలలో 387 వార్డు స్థానాలకు, పెబ్బేరు మండలంలోని గుమ్మడం, పాన్గల్ మండలం లోని తెల్ల రాళ్ల పల్లి, రేమద్దుల ఎంపిటిసి స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా లో ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామ సర్పంచ్ స్థానానికి, పలు గ్రామ పంచాయతీలకు సంబంధించి 52 వార్డులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐజ మండలం లోని ఉత్తం ఊరు, ధరూర్ మండలం లోని భీంపురం, గూడెం దొడ్డి, మల్దకల్ మండలంలోని ద్వారం, విఠలాపురం, గట్టు మండలం లోని మిట్టదొడ్డి, అలంపూర్ మండలంలోని కాశీపూర్, క్యాతూర్, భీమవరం, వడ్డేపల్లి మండలం లోని బుధ మరుసు గ్రామాలకు సంబంధించిన మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

నాగర్ కర్నూలు జిల్లా : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లోని మాచినేని పల్లి, ఉప్పునుంతల మండలం తిరుమలాపూర్, వెల్దండ మండలం, ఎం జి కాలనీ తండా, కోడేరు మండలం లోని కొండ రావు పల్లి, అచ్చంపేట మండలం రామాజిపల్లి, కల్వకుర్తి మండలం మార్చాలా సర్పంచ్ స్థానాలు, 50 వార్డు స్థానాలు ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో కొల్లాపూర్ మండలం లోని సింగోటం, నాగర్ కర్నూల్ మండలం గగ్గుల పల్లి ఎంపిటిసి స్థానాలు ఖాళీగా ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఈ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు మే నెలలో జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed