బుమ్రా కెరీర్‌లోనే వరస్ట్ ఐపీఎల్ సీజన్.. ఆ మ్యాజిక్ ఏమైంది?

by Malleboina Mahesh |

ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శన ముంబై ఇండియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. తన కెరీర్‌లోనే అత్యంత పేలవమైన గణాంకాలతో ఈ సీజన్‌ను ముగించిన బుమ్రా వైఫల్యంపై విశ్లేషణ.

బుమ్రా కెరీర్‌లోనే వరస్ట్ ఐపీఎల్ సీజన్.. ఆ మ్యాజిక్ ఏమైంది?
X

దిశ, వెబ్ డెస్క్: భాతర క్రికెట్ జట్టులో కీలక బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah.).. ఐపీఎల్ 2026 లో అత్యంత పేలవంగా ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రపంచ కప్ లో టాప్ బౌలర్ గా నిలిచిన అతను ఐపీఎల్ లో యువ బ్యాటర్ల ధాటికి తట్టుకోలేక భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు. ముఖ్యంగా 7 మ్యాచుల తర్వత మొదటి వికెట్ ఖాతాలో పడిందంటే ఈ సీజన్ లో అతను ఫామ్ ఎలా ఉందో అర్థమవుతుంది. దీంతో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఐపీఎల్ 2026 సీజన్ ఒక పీడకలగా మిగిలిపోయింది. గత దశాబ్ద కాలంగా ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా కొనసాగుతున్న బుమ్రా, ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. సాధారణంగా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసే బుమ్రా, ఈసారి భారీగా పరుగులివ్వడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యారు. ఆయన కెరీర్‌లోనే అత్యధిక ఎకానమీ రేటు నమోదైన సీజన్‌గా ఇది నిలిచింది.

బుమ్రా వైఫల్యానికి ప్రధానంగా డెత్ ఓవర్లలో ఆయన వేసే యార్కర్లు కచ్చితత్వంతో పడకపోవడమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ముంబై ఇండియన్స్ ఇతర బౌలర్లు అవతలి వైపు నుంచి ఒత్తిడి తీసుకురాకపోవడంతో, బ్యాటర్లు బుమ్రాపై లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. గాయాల నుంచి కోలుకుని వచ్చిన తర్వాత ఆయన మునుపటి వేగాన్ని అందుకోలేకపోవడం కూడా టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి త్వరగా నిష్క్రమించడానికి బుమ్రా ఫామ్‌లో లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి ప్రపంచ అత్యుత్తమ బౌలర్ బుమ్రా ఇలా భారీగా పరుగులు ఇవ్వడం అతని కెరీర్ పై ప్రభావం చూపుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story