Hyderabad Metro ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన L&T ఎండీ

by Javid Pasha |   (  Updated:2022-03-31 11:34:52  IST  )

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు మెట్రో కుదేలైంది. ప్రయాణికుల ఎద్దడి తగ్గడంతో మెట్రో.. Latest Telugu News..

Hyderabad Metro ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన L&T ఎండీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు మెట్రో కుదేలైంది. ప్రయాణికుల ఎద్దడి తగ్గడంతో మెట్రో తీవ్ర నష్టాలు ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం మెట్రో తిరిగి తన పూర్వ వైభవాన్ని పుంజుకుంటుంది. మెట్రో వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎల్ అండ్ టీ ఎండీ ప్రయాణికుల సౌకర్యం కోసం సరికొత్త విధానాన్ని అమలు చేశారు. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లలో సూపర్ సేవర్ కార్డును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి తర్వాత మెట్రో ఇన్నాళ్లకు మళ్లీ పుంజుకుంటుందన్నారు. అంతేకాకుండా మెట్రోకు మళ్లీ 60 శాతం రద్దీ వచ్చిందని పేర్కొన్నారు. మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ ఎండీ మరో శుభవార్త తెలిపారు. హాలిడేస్‌లో కేవలం రూ.59తో రోజంతా మెట్రో సేవలు వినియోగించుకోవచ్చని, ఈ ఆఫర్ కేవలం 100 హాలీడేస్‌కు మాత్రమే వర్తింసుందని ఆయన తెలిపారు.

Next Story