NCC ట్రైనింగులో అపశ్రుతి.. గురితప్పి ఇంట్లోకి దూసుకువచ్చిన బుల్లెట్

by Muthe.Rajitha |

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో బులెట్ మిస్ ఫైర్ ఘటన కలకలం రేపింది.

NCC ట్రైనింగులో అపశ్రుతి.. గురితప్పి ఇంట్లోకి దూసుకువచ్చిన బుల్లెట్
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో బులెట్ మిస్ ఫైర్ ఘటన కలకలం రేపింది. వశిష్ఠ గోదావరి తీరాన ఉన్న వైఎన్ కాలేజ్ గ్రౌండ్‌లోని ఎన్‌సీసీ ఫైరింగ్ రేంజ్‌లో మంగళవారం సాయంత్రం క్యాడెట్లు లైవ్ ఫైరింగ్ శిక్షణ చేపట్టారు. కాగా ఈ సమయంలో బుల్లెట్ గురి తప్పి సమీపంలో ఉన్న ఒక ఇంటి గ్లాస్ విండోను చీల్చుకొని లోపలికి దూసుకొచ్చింది. ఈ సంఘటనతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు. బుల్లెట్‌ను, గ్లాస్ విండోను స్థానికులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది.

ఫైరింగ్ రేంజ్‌కు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నివాస ప్రాంతం సమీపంలో లైవ్ ఫైరింగ్ ఎలా నిర్వహిస్తారని, ప్రాణాపాయం జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. సమాచారం అందుకున్న నరసాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించగా.. ఎన్‌సీసీ అధికారులు కూడా ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఫైరింగ్ రేంజ్‌లో భద్రతా నిబంధనలు ఉల్లంఘించారా లేదా అన్నదానిపై విచారణ జరుగుతుండగా, బుల్లెట్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నారు.

Next Story