BRS: చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే తమ ఏడో గ్యారంటీ అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే తమ పాలసీ అని నిరూపిస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్‌లో పేర్కొన్నారు.

BRS: చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే తమ ఏడో గ్యారంటీ అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే తమ పాలసీ అని నిరూపిస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్‌లో పేర్కొన్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం తమ పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటని విమర్శించారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని.. నిర్బంధాలకు భయపడేది లేదని.. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

Next Story