భూ కేటాయింపులపై రాజకీయ దుమారం..

by Kodari Anjali |

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూములు కేటాయింపు పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల మధ్య పెద్ద దుమారం చెలరేగింది.

భూ కేటాయింపులపై రాజకీయ దుమారం..
X

దిశ, సత్తుపల్లి: బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూములు కేటాయింపుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల మధ్య పెద్ద దుమారం చెలరేగింది. ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2008లో సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో 203.20 ఎకరాల భూమిని గిరిజన సన్నా చిన్న కారు రైతుల వద్ద నుంచి సేకరించి తెలంగాణ ఇండస్ట్రీలు ఇన్ఫాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ టిజి ఐఐటీ కి అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ. కోట్లు నిధులు కేటాయించి మౌలిక వసతులను కల్పించగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ధర రూ. 40 లక్షల నుంచి 50. లక్షల వరకు ఉంది. 2014 నుంచి బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ అభివృద్ధి నోచుకోపోవడంతో 2022 లో టీజీ ఐ ఐ సి ధర రూ.35.71. తగ్గించి ఇండస్ట్రీలకు ఆహ్వానించారు.

72.ఎకరాల భూమిని కేటాయించాలని విజ్ఞప్తి..

సదరు కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఇటీవల 2026 న ఏపీకి చెందిన దీపక్ నెక్స్ట్ జెన్ పిట్స్ సంస్థ రూ 515 కోట్లు పెట్టుబడితో బ్రీడ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుటకు 72.ఎకరాల భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం టీజీ ఐఐసి ఎకరం ధర 35.71. ఉన్నప్పటికీ ఏకంగా ఎకరం భూమి రూ 21.లక్షలకి కేటాయించడంపై రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీజీ ఐఐసీ సంస్థ తక్కువ ధరకు భూమి కేటాయించటం రెండేళ్ల లీజు తర్వాత సదురు కంపెనీకి భూమి రిజిస్ట్రేషన్ ద్వారా బదలాయింపు జరిగేలాగా నిబంధనలు మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు నాయకులు బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూములు కేటాయింపులో అవినీతి చోటుచేసుకుందని బిజెపి, టిఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయటంతో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూములపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది.

రూ.వేయి కోట్ల మేర అవినీతి ఆరోపణలు

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూ కేటాయింపులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీ ఐఐసి ధర రూ. 40 లక్షలు ఉండగా, బుగ్గపాడు భూములను 2022 లో 35.71 లక్షలకు ధర నిర్ణయించారు. ప్రస్తుతం ఎకరం 35.71 లక్షల నుంచి కుదించి రూ.21. లక్షలకి ఏపీకి చెందిన దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్ ఇండస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పటానికి సుమారు 72 ఎకరాలు విస్తీర్ణం గల భూమిని ఎకరం రూ.21. లక్షల కి కేటాయించారు. రెండేళ్ల అనంతరం సదురు కంపెనీకి భూమి రిజిస్టర్ ద్వారా బదలాయింపు చేపట్టడం సదురు కంపెనీకి మంత్రి కుమారుడు స్లీపింగ్ పార్ట్నర్ వ్యవహరించడంతోనే అతి తక్కువ ధరకు భూములు కేటాయింపులు జరిగినట్లు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినపడుతున్నాయి. నేపథ్యంలో ఇటీవల బీజేపీ టీజీ ఇంచార్జి రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బుగ్గపాడు అవినీతిని బయట పెట్టాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేపట్టాలని గిరిజన పేద రైతుల భూములను ఏపీ కంపెనీకి ధారా దత్తం చేయటం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని దీనిపై కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి మోడీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. మరోపక్క టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, బుగ్గపాడు భూములు కేటాయింపులు రూ వేయి కోట్లు రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బుగ్గుపాడు భూ కేటాయింపుల్లో కిట్ పోకో జరిగిందని పెద్ద ఎత్తున తెర వెనక అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. భూ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచించి కేటాయింపుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అవినీతిని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సవాల్

సత్తుపల్లి మండలం బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూములు కేటాయింపుల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోలేదని ఈ ప్రాంత అభివృద్ధి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పడావుగా పడి ఉన్న ఫుడ్ పార్క్ భూములు కేటాయింపుతో ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు భూములు ఇచ్చిన రైతులకు మేలు జరుగుతుందని ఆశయంతో మంత్రివర్గం నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీజీ ఐఐసీ ధర నిర్ణయం మేరకే ఏపీ కంపెనీకి భూములు కేటాయించడం జరిగిందని బుగ్గపాడు భూములు కేటాయింపులు ఆరోపణ చేస్తున్న బిజెపి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతిని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని లేకపోతే రాజకీయ పార్టీల నాయకులు సత్తుపల్లిని వెళ్లిపోతారా అంటూ బహిరంగ సభలు విసిరారు. ఈ నేపథ్యంలో బుగ్గపాడు భూములు కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది. భూములు కేటాయింపు జరుపుతుందా లేదా అనే విషయంపై బుగ్గపాడు రైతుల్లో ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Next Story