ఆ తెలుగు ఛానెల్‌పై మండలి చైర్మన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఫిర్యాదు

by Malleboina Mahesh |

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును అవమానించేల యాంకర్ ప్రవర్తించిన విషయం తెలిసిందే.

ఆ తెలుగు ఛానెల్‌పై మండలి చైర్మన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (MLC Takkellapalli Ravinder Rao)ను అవమానించేల యాంకర్ ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యవహారంపై ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ నేతలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender)ని కలిసి ఫిర్యాదు చేశారు. ఛానెల్ ప్రతినిధులు అనుచితంగా ప్రవర్తించారని, ప్రజాప్రతినిధిగా ఉన్న తన గౌరవానికి భంగం కలిగించారని ఆయన చైర్మన్‌కు వివరించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన చైర్మన్, దీనిపై నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వెంట శాసనమండలి విప్ దేశపతి శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, నవీన్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మీడియా సంస్థలు చర్చల పేరుతో ప్రజాప్రతినిధులను కించపరచడం సరికాదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న బీఆర్ఎస్ (BRS).. ఏబీఎన్ ప్రతినిధులపై.. పార్టీ అన్ని కార్యక్రమాలకు నిషేధం విధించారు.

Next Story