- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ టార్గెట్‌గా బండి సంజయ్ మాట్లాడుతున్నారని.. తాము వ్యక్తులకు వ్యతిరేకం కాదని.. వ్యవస్థలో వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ వారి తరఫున ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ వారు సోషల్ మీడియాలో కేటీఆర్‌పై ఎన్ని రంకులు అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కేటీఆర్‌పై మాట్లాడిన మాటలు సామాన్య ప్రజలు కూడా మాట్లాడరని అన్నారు. అంతుచూస్తా అని అంటుంటే కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరంగల్‌లో కేటీఆర్ మాట్లాడితే కేసులు పెట్టారని.. చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది సీట్లు గెలుచుకున్నారని.. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మిత్ర బృందంగా మారాయని అన్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ వాళ్లు చెప్పేది వినాలననుకుంటే ఖద్దరు చొక్కాలు వేసుకోవాలని సూచించారు. డీజీపీ గతంలో సీపీగా పనిచేశారని.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలని అన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమారుడి విషయంలో బీఆర్ఎస్ బాధితురాలి పక్షాన ఉన్నదని చెప్పారు. కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది కుల సమస్య కాదు లా అండ్ ఆర్డర్ సమస్య అని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.






