మండపంలో వరుడితో వధువు అగ్రిమెంట్‌.. సైన్ చేస్తేనే పెళ్లి !

by Dishanational2 |
మండపంలో వరుడితో వధువు అగ్రిమెంట్‌.. సైన్ చేస్తేనే పెళ్లి !
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్లలో ఏ క్షణాన ఎలాంటి ట్విస్ట్ రివీల్ అవుతుందో ఊహించలేకపోతున్నాం. సరిగ్గా తాళి కట్టే సమయానికి వధువు/వరుడు ఇచ్చే షాక్‌కు మైండ్ బ్లాంక్ అవుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఒక ఇన్‌స్టా యూజర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'కాంట్రాక్ట్ బేస్డ్ మ్యారేజెస్' గురించి ఎప్పుడైనా విన్నారా?' అనే క్యాప్షన్‌ గల ఈ వీడియోలో నవ వధువు 'కాన్ఫిడెన్షియల్' అని రాసి ఉన్న ఒక కవర్ పట్టుకుంది. అందులో పెళ్లికి ముందు వరుడి కోసం కొన్ని నిబంధనలు పొందుపరిచినట్లు పేర్కొన్న యువతి.. వాటన్నింటికీ అతను ఒప్పుకుని సంతకం పెడితేనే పెళ్లి జరుగుతుందని మెలిక పెట్టింది.

'కరణ్, హర్షు మధ్య ప్రేమ ఒప్పందం' అనే టైటిల్‌తో కూడిన కాంట్రాక్ట్ పేపర్‌లో.. వివాహం తర్వాత వరుడు వాగ్ధానం చేయాల్సిన పనులను పేర్కొంది.

* S.W.A.T(అమెరికన్ టీవీ సిరీస్)ను ఏ కారణంతోనైనా ఎప్పుడూ మిస్ కానివ్వద్దు.

* 'ఐ లవ్ యూ' మంత్రాన్ని రోజుకు కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు రిపీట్ చేయాలి.

* నేను లేకుండా బటర్ బోన్‌లెస్ చికెన్ తినకూడదు.

* 'తేరీ కసమ్' అనే మాట ఇద్దరి మధ్య నమ్మకానికి గీటురాయిలా ఉండాలి. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ముచేయకూడదు.

* మరణం వరకు ఒకరినొకరు ప్రేమను పంచుకుంటూ, అప్పుడప్పుడూ లాలిస్తూ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి.


Next Story