- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రెజిల్ లిథియం మైనింగ్ లో భాగస్వామ్యానికి సింగరేణికి ఆహ్వానం
తాము చేపట్టిన లిథియం మైనింగ్ లో భాగస్వామిగా చేరాలని బ్రెజిల్ సంస్థ సింగరేణి సంస్థను కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో : తాము చేపట్టిన లిథియం మైనింగ్ లో సింగరేణి సంస్థ భాగస్వామిగా చేరాలని కోరుతూ బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సీబీఎల్సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సింగరేణి ఛైర్మన్ , ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతిని కలిసి వివరాలను తెలిపింది. సీబీఎల్ (కంపాన్హియా బ్రసిలీరా డి లిటియో) బోర్డు డైరెక్టర్ డేనియల్ లెమే, సీఈవో వినీసియస్ అల్వారెంగా తమ కంపెనీ ఏవిధమైన పనులు చేపడుతుందని తెలిపారు. బ్రెజిల్ దేశంలో ఇప్పటికే తాము లిథియం మైనింగ్ చేపట్టామని, సింగరేణి సంస్థ కీలక ఖనిజాల పట్ల ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తమ కంపెనీలో భాగస్వామిగా చేరినట్లయితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారు వివరించారు.
తాము సింగరేణితో పాటు దేశంలోని ప్రముఖ కంపెనీలను కూడా సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచంలో లిథియం కీలక ఖనిజానికి ఉన్న ప్రాధాన్యత, వ్యాపార కోణంలో ఉన్న లాభదాయకత గురించి వివరించారు. సింగరేణి సంస్థకు సంబంధించిన వివరాలను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్స్ గౌతమ్ పోట్రు చెప్పారు. బ్రెజిల్ దేశంలో కీలక ఖనిజ అవకాశాలను, లాభదాయకత తదితర అంశాలను తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి ఉన్నతాధికారులు పేర్కొన్నారు.






