- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై బీజేపీ స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) వేళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే దారిలో నడుస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన స్కామ్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని అన్నారు. హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖల మంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పరిపాలన గాలికి వదిలి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ క్రమంగా కనుమరుగు అవుతుందని అన్నారు. సార్ లేరు.. సర్కార్ లేదు.. కారు లేదు.. అని ఎద్దేవా చేశారు. మున్సి్పల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు పనిచేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ మా పార్టీ బలంగా ఉందని అన్నారు. ఒంటరిగానే పోటీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 7 నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.






