పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు.. పార్టీ మార్పు ప్రచారాలపై ఈటల రాజేందర్ ఫైర్

by Malleboina Mahesh |   (  Updated:2026-04-05 10:16:02  IST  )

పార్టీ మార్పు ప్రచారాలపై ఈటల రాజేందర్ క్లారిటీ! పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదంటూ ఫైర్. హైడ్రా కూల్చివేతలపై ధ్వజమెత్తుతూ పోరాటాం.

పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు.. పార్టీ మార్పు ప్రచారాలపై ఈటల రాజేందర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) బీజేపీని వీడి ఇతర పార్టీలోకి చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారాంపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ.. ఆ వార్తలను కొట్టిపారేశారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరుగుతున్నవి 'పిచ్చి ప్రచారాలు' అని మండిపడ్డారు. తాను, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ మారుతున్నామన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అలాగే "పార్టీ మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదని..తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు మా పార్టీలోనే కొందరు ఊతమివ్వడం విచారకరకరమని అన్నారు.

తాను పదవుల కోసం పద్దులు మోసే వ్యక్తిని కాదు" అని ఈటల ఘాటుగా స్పందించారు. కేసీఆర్ తనను పార్టీ నుంచి బయటకు నెట్టి ఐదేళ్లు అవుతోందని, ఆనాడు తన గోడు వినేవారే లేరని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా 'హైడ్రా' పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడం అరాచకమని ధ్వజమెత్తారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని వెల్లడించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికలపై ఇప్పటికే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.

రాష్ట్రంలో మరో భూకుంభకోణం.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు

Next Story